క్రైమ్/లీగల్

గూడ్స్ వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మే 21: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు బయలుదేరింది.
మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పంతంగి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. ముందుగా వెళ్తున్న గూడ్స్ వెహికల్ స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రావు (44) అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన టి.వేణుగోపాల్, రాజశేఖర్, రమేష్‌కుమార్‌లకు బలమైన గాయాలవ్వడంతో హైదరాబాద్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. మరో ఆరుగురు స్వల్పంగా గాయపడటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికిలో చికిత్స నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నవీన్‌బాబులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం... గూడ్స్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఆర్టీసీ బస్ క్యాబిన్‌లోనే మృతి చెందిన డ్రైవర్