క్రైమ్/లీగల్

వీవీ ప్యాట్‌ల లెక్కింపు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 21: ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈవీఎంల కంటే ముందుగా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంల కంటే ముందుగా ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని న్యాయవాది వై బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని హౌస్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది.
ఈవీఎంల కంటే ముందుగా ఐదు వివి ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. ఇందులో తేడా వస్తే అన్ని వీవీ ప్యాట్ లు లెక్కించాలని కోరారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు విచారణకు హాజరుకాగా పిటిషనర్ న్యాయవాది బాలాజీ తన వాదనలు వినిపించారు. వాదనల అనంతరం బాలాజీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. లెక్కింపు సందర్భంగా వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఈ పిటిషన్‌ను బెంచి తోసిపుచ్చింది.