క్రైమ్/లీగల్

సుప్రీం కోర్టుకు మరో నలుగురు జడ్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తుల నియామకాన్ని కేంద్రం ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ నలుగురి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుకుంది. ప్రధాన న్యాయమూర్తితో సహా 31 మంది ఉండాల్సిన సుప్రీం కోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇంకా 4 స్థానాలను అనిరుద్ద బోస్, ఏఎస్ బొపన్న, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌తో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గతంలోనే బోస్, బొపన్న పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం ప్రభుత్వానికి పంపింది. అయితే సీనియారిటీ, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ పేర్లను తిరస్కరించింది. అయితే కొలీజియం మరోసారి వీరి పేర్లను సూచించడంతో ప్రభుత్వం వారి నియామకాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. అదే విధంగా గవాయ్, సూర్యకాంత్ పేర్లను కూడా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు గల కొలీజియం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించడంతో, రాష్టప్రతి ఆమోద ముద్ర కోసం గురువారం ఈ ప్రతిపాదన రామ్‌నాథ్ కోవింద్‌కు చేరనుంది.