క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 22: పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆర్టీఏ కార్యాలయ సూపరింటెండెంట్ చిక్కిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ తాండూరుకు చెందిన రమేశ్ లారీ ఆర్‌సీ తీసుకునేందుకు వస్తే రూ.10వేలు డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులను రమేశ్ ఆశ్రయించి విషయాన్ని తెలియజేశాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ప్రవీణ్‌కుమార్‌ను పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వలపన్ని ప్రవీణ్ కుమార్‌ను రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నగదు స్వాధీనంతో పాటు, ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.