క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 22: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి బైపాసు రోడ్డు వద్ద బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పోలీసు స్టేషన్ పరిధి ఘట్‌కేసర్ బైపాసు రోడ్డు ఎదులాబాద్ వెహికిల్ అండర్ పాసు రోడ్డు సమీపంలో స్కూటీ వాహనంపై వెళ్తున్న నాగారం పురపాలక సంఘం రాంపల్లి సాయిబాబానగర్ కాలనీకి చెందిన గుండెగోని కృష్ణ కుమారుడు పృధ్వీరాజ్(21)ను ఉప్పల్ నుంచి భువనగిరి వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో స్కూటీ అదుపుతప్పి కింద పడ్డాడు. విద్యార్ధి పృధ్వీరాజ్ తలకు తీవ్రంగా గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కీసర మండలం చీర్యాల గ్రామంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వార్షిక పరీక్షల సెంటర్ ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని వీబీఐటీ కళాశాలలో ఉన్నందున పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు.