క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, మే 22: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా సాంబయ్యపల్లి ప్రాంతానికి చెందిన నాగార్జున రెడ్డి(25) కేపీహెచ్‌బీకాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ మాదాపూర్‌లోని జెరోడా ట్రేడింగ్ కంపెనీలో సెల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో కేపీహెచ్‌బీకాలనీలోని నాల్గొవ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పడంతో పక్కనే ఉన్న ఆశోక్ లేలాండ్ మినీ ట్రాక్ వాహనం వెనుక చక్రాల కింద పడ్డాడు. వాహనం నాగార్జున రెడ్డి మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.