క్రైమ్/లీగల్

చోపర్ స్కాంలో అనుబంధ చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తి సుశేన్ మోహన్ గుప్తాకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని ఒక కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ముందు గుప్తాకు వ్యతిరేకంగా ఈ అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గుప్తాను ఇదివరకే అరెస్టు చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన రాజీవ్ సక్సేనా వెల్లడించిన విషయాల ఆధారంగా గుప్తా పాత్ర బయటపడిందని ఈడీ ఇదివరకే తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి దేశ బహిష్కారానికి గురయిన సక్సేనాను ఇక్కడికి వచ్చిన వెంటనే ఈడీ అరెస్టు చేసింది.