క్రైమ్/లీగల్

కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో జాకీర్ ముసా కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 24: కాశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అల్‌ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ ఘజ్‌వత్-ఉల్-హింద్ చీఫ్ జాకీర్ ముసాను భద్రతా దళాలు హతమార్చాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ట్రల్‌లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. పారిపోతున్న ఓ ఉగ్రవాదిపై కాల్పులు జరపగా ముసా హతమైనట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేష్ కాలియా వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. దడ్సారా గ్రామంలో కార్డన్ సెర్చ్ చేస్తుండగా ఆందోళనకారులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ ఖాతరు చేయకుండా పారిపోతుండడంతో వారిపై కాల్పులు జరపాల్సి వచ్చినట్లు సీనియర్ భద్రతా దళాల అధికారి చెప్పారు. కాల్పుల్లో ఉగ్రవాద సంస్థ చీఫ్ ముసా హతమైనట్లు అధికారులు ధ్రువీకరించారు. ముసాకు మద్దతుగా గురువారం అర్ధరాత్రి షోపియన్, పుల్వామా, అవంతిపుర, శ్రీనగర్‌లలో ప్రదర్శనలు జరిగాయనీ, ఇదే సమయంలో ఆందోళనకారులను లొంగిపోవాలని హెచ్చరించామని పేర్కొన్నారు. ఈ సందర్నంగా బుద్గాం, పుల్వామా, శ్రీనగర్, అనంత్‌నాగ్ జిల్లాలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. కాశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీస్‌లను సైతం స్తంభింపజేశారు. ముసాను హతమార్చడం భద్రతా దళాలు సాధించిన ‘విజయం’గా పోలీస్ శాఖ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 2013 నుంచి ముసాపై అనేక కేసులున్నాయి. తొలుత హిజ్‌బుల్ ముజాహుదీన్‌లో ఉన్న ముసా అన్సర్ గజ్వత్- ఉల్-హింద్‌ను స్థాపించాడు.