క్రైమ్/లీగల్

శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న రాజీవ్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: శారదా చిట్ ఫండ్ భారీ కుంభకోణం కేసులో తనను సీబీఐ పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాల్సిందిగా కోల్‌కత్తా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాల్సిందిగా రాజీవ్ కుమార్ ఈ నెల 17న సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆయన అభ్యర్థనకు ఏడు రోజుల పాటు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది.
కాగా ఆ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో సీబీఐ తనపై ఎటువంటి చర్య తీసుకోకుండా రక్షణ కల్పించాల్సిందిగా రాజీవ్ కుమార్ మళ్లీ పిటీషన్‌ను దాఖలు చేశారు. ఇలాఉండగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ రాజీవ్ కుమార్ పిటీషన్‌ను పరిశీలించి తోసిపుచ్చింది. గతంలోనే (17న) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించి ఏడు రోజుల పాటు రక్షణ కల్పించిన విషయాన్ని వెకేషన్ బెంచ్ ఉటంకించింది. ఐపీఎస్ అధికారి మళ్లీ కొత్తగా పిటీషన్ దాఖలు చేయడం భావ్యం కాదని వ్యాఖ్యానించింది.
పిటీషనర్ రాజీవ్ కుమార్ రక్షణ కోసం కోల్‌కత్తా హైకోర్టును లేదా ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని ఈ బెంచ్‌లోని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, సూర్య కాంత్ సూచించారు.