క్రైమ్/లీగల్

గంజాయి గుట్టు రట్టు *యువకుడికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 24: జల్సాలకు అలవాటు పడి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని అమ్మటంతో పాటు ఏకంగా ఇంట్లో గంజాయి చెట్లను పెంచుతున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న సోమాని శ్రీశైలం కుమారుడు విగ్నేష్(21) జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మటంతో పాటు ఏకంగా ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. గంజాయి అమ్మటంతో పాటు మొక్కలను పెంచుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఘట్‌కేసర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య తన సిబ్బందితో శుక్రవారం ఉదయం దాడి జరిపి రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఎనిమిది నెలల ఐదు గంజాయి చెట్లు, నాలుగు 100 గ్రాముల పాకెట్లు, 400 గ్రాముల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ మల్లయ్య తెలిపారు.విద్యుత్ స్టోర్ నుంచి
రూ. 2కోట్లు విలువైన సామాగ్రి చోరీ

* సంబంధిత పత్రాలు లేకపోవడంతో
పోలీస్‌స్టేషన్‌కు వాహనం తరలింపు
బాలానగర్, మే 24: ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టుకోలేని విధంగా కంచె చెను మేసిన విధంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని టీ ఎస్ టీడీసీ ఎల్‌లో తను చేస్తున్న సంస్థకే సిబ్బంది కన్నం వేసి ఆదాయానికి గండి కోడుతున్న వైనం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం మధ్యాహ్నం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అందరూ టీవీలకు నిమగ్నమై ఉండడంతో విద్యుత్ సంస్థలో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎర్రగడ్డలోని విద్యుత్ స్టోర్ నుంచి పరికారాలను గాంధీనగర్‌కు వాహనంలో తరలిస్తుండగా బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వాహనాన్ని అందుపులోకి తీసుకున్నారు. పరికరాలకు సంబంధించిన పత్రాలు, వే బిల్లులు, గేట్‌పాస్‌లు లేనందున్న బాలానగర్ పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్న వాహనంలోని పరికరాలకు సంబంధించిన పత్రాలను తాము సమర్పిస్తామని పోలీసులకు సమాచారం అందించిన అధికారులు స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది.
స్క్రాప్ గోదాములో

అగ్నిప్రమాదం
జీడిమెట్ల, మే 24: స్క్రాప్ గోదాములు అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోజరిగింది. దొమ్మరపోచంపల్లి గ్రామం, గండిమైసమ్మ ఉజ్వల్ బార్ ఎదురుగా ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన గల సాయి శిరీష ట్రేడర్స్ పేరుతో తులసీ రెడ్డి స్క్రాప్ గోదామును నడుపుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు గోదాములో మంటలు చెలరేగాయి. ప్రక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాదంలో గోదాములోని స్క్రాప్ దగ్ధమైంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలను సేకరించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పిడుగుపడి ఒకరి మృతి
షాద్‌నగర్ రూరల్, మే 24: పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కంసాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షానికి పిడుగు పడి ఆవ యాదయ్య (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తున్న సమయంలో సమీపంలో ఉన్ను మర్రిచెట్టు కిందకు వెళ్లగా అదేసమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు.