క్రైమ్/లీగల్

వైమానిక దాడుల్లో 9 మంది పౌరులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనా, మే 25: యెమెన్ మూడో నగరమైన తైజ్‌లో గత రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 9 మంది పౌరులు మృతి చెందినట్లు ఓ వైద్యుడు, స్వతంత్ర తిరుగుబాటు దారుడు శనివారం తెలిపారు. సౌదీ నేతృత్వంలోని సైనిక సంకీర్ణ బలగాలు జరిగిన ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారని పేర్కొన్నారు. వీరితో పాటు అనేకమంది గాయ పడ్డారన్నారు. హుతి తిరుగుబాటు దారులు సంకీర్ణ తైజ్ గ్రామంలో పెట్రోల్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని సబా వార్త సంస్థ పేర్కొంది. తైజ్ నగరం ఇరాన్ హుతి తిరుగుబాటుదారుల ముట్టడిలో ఉంది. సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్ నేతృత్వంలోని సైనిక సంకీర్ణ మద్దతుతో ప్రభుత్వేతర దళాలు వీరిని నియం త్రిస్తున్నాయ. నాలుగేళ్లుగా ఈ దాడుల్లో వేలాది మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.