క్రైమ్/లీగల్

జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కోడి కత్తి శ్రీను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 25: తాజా ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన జె శ్రీనివాసరావు శనివారం బెయిల్‌పై రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలు నుంచి విడుదలయ్యాడు. ఏడు నెలల క్రితం పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళుతున్న జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలులో ఉంటున్న శ్రీనివాసరావుకు న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం ఉదయం 9.20 గంటలకు శ్రీనివాసరావును జైలు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను జగన్ అభిమానని, ఆనాడు జగన్‌పై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని స్పష్టం చేశాడు. తన వద్ద ఉన్న కత్తి ఆయనకు తగిలిందన్నారు. ప్రజాసమస్యలను వివరించేందుకు కాగితంపై రాసుకుని వెళ్లానన్నారు.
ప్రమాదవశాత్తు ఆయనకు కత్తి తగిలిందన్నాడు. ఈవిషయంలో తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే కత్తితో తల నరుక్కుంటానని సవాల్ విసిరాడు. నార్కోటిక్ పరీక్షలకు సిద్ధమన్నాడు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధికోసమే జగన్‌పై హత్యాయత్నాన్ని రాద్ధాంతం చేసిందని ఆరోపించాడు. చెఫ్‌గా పనిచేసే తన వద్ద కత్తులు ఉండటం సహజమేనన్నారు. దాడి అనంతరం జగన్ వెంట ఉన్న కార్యకర్తలు తనను కొడుతుంటే జగనే అడ్డుకున్నారన్నాడు. తాను ప్రాణాలతో ఉండటానికి కారణం జగనేనని వ్యాఖ్యానించాడు. ప్రజలు కోరుకున్న విధంగా తాను అన్నగా భావించే జగన్ ముఖ్యమంత్రి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.