క్రైమ్/లీగల్

కన్నబిడ్డల్ని కడతేర్చిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 25 : సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. పేగుతెంచుకున్న కన్నబిడ్డల్ని అత్యంత కర్కశంగా నోట్లో గుడ్డలు గుక్కి..బీరు బాటిల్‌తో దారుణంగా పొడిచి హత్య చేసిన ఘటన శనివారం జిల్లా కేంద్రంలో సాయి విద్యానగర్ కాలనీలో చోటుచేసుకుంది. కన్నబిడ్డల్లి కర్కషంగా పొడిచి చంపి..ఇంటికి గొళ్లెం పెట్టి ఏమి ఎరుగనట్టు వెళ్లి..కరీంనగర్ జిల్లా పోలిస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. అత్యంత దారుణ సంఘటన వివరాలు అడిషనల్ డీసీపీ నర్సింహా రెడ్డి కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల బాస్కర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడీ కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కాకాలపల్లి గ్రామానికి చెందిన చింతల సరోజలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అయాన్ (5) హర్షవర్దన్ (3) ఉన్నారు. వీరికి గత కొంత కాలంగా కుటుంబ గోడవలు జరుగుతున్నాయన్నారు. కుటుంబ కలహాల విషయంపై పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. శనివారం భాస్కర్ కారు తీసుకొని డ్యూటీకి వెళ్లగానే సరోజ మద్యం సేవించిన ఆనంతరం టీవీ సౌండ్ పెద్దగా పెట్టి మద్యం మత్తులో ఇద్దరు పిల్లలను అయాన్, హర్షవర్దన్ నోట్లో గుడ్డలు గుక్కి బీరు బాటిల్ పగుల గొట్టి కడుపులో పొడిచి పేగులు బయటకు వచ్చేల కర్కషంగా పొడిచి చంపివేసిది. ఇద్దరు పిల్లల బట్టలు రక్తంతో తడసిపోయాయి. ఇద్దర్ని మంచంపై పడుకోబెట్టింది. తాను సైతం ఆత్మహత్య చేసుకుంటానని .బైబై అని వ్రాసి సూసైడ్ నోట్ వ్రాసి ఇంటికి గొళ్లెం వేసి బయటకు వెళ్లినట్లు తెలిపారు. ఇంటినుండి కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులు సమాచారం ఇవ్వటంతో సిద్దిపేట వన్‌టౌన్ సీఐ నందీశ్వరెడ్డికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
సిద్దిపేట సాయివిద్యానగర్‌లోని కన్నపిల్లలను దారుణంగా హత్య చేసిన విషయం కరీంనగర్ పోలీసులు సమాచారం ఇవ్వటంతో సిద్దిపేట జిల్లా అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ రామేశ్వర్, సీఐ నందీశ్వర్‌రెడ్డిలు సిబ్బందితో వెళ్లి ఇంటికి వెళ్లె చూసేసరికి ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేయబడి ఉన్నారు, మంచపై మృతదేహాలుండగా, గది అంత రక్తస్రవమైంది, పిల్లలన కడుపులో పేగులో బయటకు వచ్చి ఉండటం పలువురిని కలచివేసింది. ప్రక్కన రెండు బీరు బాటళ్లు పడి ఉన్నాయి. పోలీస్ అధికారులు క్లూస్ టీంను రప్పించి, ఆధారాలు సేకరించారు. పిల్లలను హత్య చేసిన విషయం భర్త భాస్కర్‌కు సమాచారం ఇచ్చారు. భాస్కర్ ఇంటికి వచ్చే విగత జీవులుగా ఉన్న పిల్లలను ఆయాన్, హర్షవర్దన్‌లను చూసి కన్నీరు, మున్నీరుగా విలపించారు. పసిపిల్లలను కర్కషంగా పొడిచేందుకు చేతులు ఏలా వచ్చాయని రోదించటం పలువురిని కంటతడి పెట్టించింది. ఈఘటన దావణంలో వ్యాపించటంతో పట్టణంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చిన చిన్నారులను చూసి కంటతడిపెడుతున్నారు. ఆనంతరం మృతదేహాలను పోస్టుమార్గం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సూసైడ్ నోట్ లభ్యం
ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన సరోజ తాను ఆత్మహత్య చేసుకబోతున్నట్లు సూసైడ్ నోట్ రాసినట్లు అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా పిల్లలను హత్య చేసి, తాను చనిపోవాలనుకున్నట్లు సూసైడ్ నోట్‌లో వ్రాసినట్లు అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి తెలిపారు. నిందితురాలు చనిపోవటానికి దైర్యం చాలక కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిపారు. నిందితురాలను సరోజును రప్పిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితురాలిని విచారించిన ఆనంతరం త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు.