క్రైమ్/లీగల్

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 26: మహబూబాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే రోడ్లపైకి రావడానికి జనం జంకుతున్నారు. ఆదివారం రోజు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కురవి మండలంలోని అయ్యగారిపల్లిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచలో 47.2, దంతాలపల్లి మండలకేంద్రంలో 46.3, కురవి మండలం ఉప్పరిగూడెంలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బయ్యారం మండల కేంద్రంలో 45.7 డిగ్రీలు, నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారంలో 45.9 డిగ్రీలు, మహబూబాబాద్ మండలంలోని మల్యాలలో 45.6 డిగ్రీలు, నెల్లికుదురు మండలంలోని మునిగలవీడులో 45.1 డిగ్రీ, కేసముద్రం మండల కేంద్రంలో 45.3, మహబూబాబాద్ మండలం అమనగల్ లో 45.5, మరిపెడ మండలకేంద్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తగూడలో 44.8, గంగారంలో 44.1. గూడూరులో 44.3, గార్లలో 42.3, డోర్నకల్‌లో 45.5, నెల్లికుదురులో 42.8, ఇనుగుర్తిలో 42.8, చిన్నగూడూరులో 42.2, తొర్రూరులో 44.1 ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదు అయింది. అలాగే వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండుమూడు రోజుల్లో ఎండల తీవ్రత నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతుండటంతో ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్పా మధ్యాహ్నం వేళలో ఆరుబయటకు రావొద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు రావాలంటే టోపీ, కండువా తప్పనిసరిగా తీసుకొని రావాలని సూచిస్తున్నారు.

వడదెబ్బకు ముగ్గురి మృతి

మహబూబాబాద్, సూర్యాపేట, మందమర్రి, మే 26: వడదెబ్బకు రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. వడదెబ్బ తట్టుకోలేక హమాలీ మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. 13వ వార్డు సుందరయ్యనగర్‌కు చెందిన భూక్యా శంకర్ (40) హమాలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హమాలీ పని లేనప్పుడు మేకలను కాస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం హమాలీ పనికి వెళ్లివచ్చిన తర్వాత మేకలు కాసేందుకు ఎండలో వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చి తనకు అస్వస్థతగా ఉందని పడుకున్నాడు. కాగా ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు నిద్రలేపగా మృతిచెంది ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు. తీవ్రంగా వీస్తున్న ఎండలు, వడగాడ్పులతో వడదెబ్బకు గురైన వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జిల్లాలోని గార్ల దంపకం బజారులో చోటు చేసుకుంది. అయిలి రాములు(70) రెండురోజలు క్రితం వడగాడ్పులతో అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో కుటుంబీకులు స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స చేయిస్తుండగా రాత్రంతా వాంతులు, వీరోచనాలై తెల్ల్లవారుజామున మృతి చెందాడు. అలాగే మంచిర్యాల జిల్లా మండదమ్రరి పట్టణంలో ఆకుల సుధాకర్ (65) అనే వ్యక్తి ఆదివారం ఉదయం వడదెబ్బకు గురై మృతిచెందాడు. గత రెండు రోజులుగా అస్వస్థతకు గురై ఉదయం మృతిచెందినట్టు స్థానికులు పేర్కొన్నారు.