క్రైమ్/లీగల్

లారీ ఢీకొని ఎఎస్‌ఐ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, మార్చి 30: లారీ ఢీకొని తీవ్ర గాయాలైన ఓ ఎఎస్‌ఐ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మండలంలోని ఆరెకోడు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తయిన సందర్భంగా అధికారులు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు. విధుల్లో భాగంగా రఘునాధపాలెం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎఎస్‌ఐ భూక్యా భాస్కర్(58) ఆరెకోడులో బందోబస్తు ముగించుకొని ఖమ్మం రూరల్ ఎస్‌ఐ జీపులో వరంగల్ క్రాస్‌రోడ్ వరకు వచ్చి దిగాడు. ఖమ్మం వెళ్ళేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్న భాస్కర్‌ను వరంగల్ క్రాస్‌రోడ్ మూలమలుపు వద్ద సిమెంట్ ట్యాంకర్ వచ్చి ఢీకొంది. ఈసంఘటనలో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎసిపిలు సురేష్‌కుమార్, నరేష్‌రెడ్డి, గణేష్, సిఐలు తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి తదితరులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న భాస్కర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడు భాస్కర్ మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. భాస్కర్‌కు భార్య చంద్రిక, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అతని స్వస్థలం ములకలపల్లి. భార్య కారేపల్లి పిహెచ్‌సి పరిధిలోని ముచ్చర్లలో ఎఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ఈమేరకు రూరల్ ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.