క్రైమ్/లీగల్

మక్కపేటలో వివాహిత హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వత్సవాయి, మార్చి 30: మండలంలోని మక్కపేట గ్రామంలో వివాహిత హత్య సంచలనం కల్గించింది. మక్కపేట - గోపినేనిపాలెం రహదారిలో జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పచ్చం నాగమణి (30) వారి ఇళ్లకు సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల వద్ద సిమెంట్ ఇటుకల మధ్యలో మృతి చెంది ఉండటాన్ని శుక్రవారం కూలీలు గుర్తించారు. మృతదేహంపై పలు చోట్ల గాయాలు, వివస్తగ్రా ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. బుధవారం నుండి ఆమె కనిపించకుండా పోయిందని భర్త రాంచంద్ చెబుతున్నాడు. ఘటనా స్థలాన్ని జగ్గయ్యపేట సీఐ జయకుమార్, వత్సవాయి ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు సందర్శించి వివరాలు తెలుసుకుని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.