క్రైమ్/లీగల్

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, మార్చి 30: కంచికచర్ల చెరువుకట్టపై శుక్రవారం వేకువజామున ప్రైవేటు బస్సు, మినీ లారీని ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా పది మందికి గాయాలు అయ్యాయి. గొల్లపూడి నుండి నందిగామ వైపు రంగుల లోడుతో వెళుతున్న మినీ లారీని నందిగామ వైపు నుండి వస్తున్న ప్రైవేటు బస్సు మినీ లారీని ఢీకొని రోడ్డు దిగువకు మూడు పల్టీలు కొట్టింది. గొల్లపూడికి చెందిన మినీ లారీ డ్రైవర్ రాయల శ్రీనివాసరావు (36) అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో 10మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిని అంబులెన్స్‌లో గొల్లపూడిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నారు.