క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో.. తండ్రీకొడుకుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మార్చి 30: పెద్దేముల్ మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుద్దారంలో విషాదం చోటుచేసుంది. పొలం పనులకు వెళ్లిన తండ్రీ, కొడుకులు గురువారం అర్ధరాత్రి విద్యుదాఘాతానికి గురయ్యారు. చెరుకు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన అనంతయ్య (55), సంతోష్‌కుమార్ (31) ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబీకులు పొలానికి వెళ్లి చూడగా విగత జీవులుగా పొలం గట్టుపై ఉన్న విద్యుత్ కంచె వద్ద పడి ఉన్నారు. మృతుల పొలం పక్కనే ఉన్న దాయాదుల అంజిలమ్మ తన పొలంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకు అడవి పందుల బెడద నుంచి నివారణ కోసం పొలం చుట్టూ విద్యుత్ సరఫరా కంచెను ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి వెళ్లిన అనంతయ్య, సంతోష్‌కుమార్ ఆ తీగను గమనించపోవడంతో మృత్యువాత పడ్డారు. మృతదేహాలను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతయ్య భార్య అమృతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకట శ్రీను వెల్లడించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు డీఎస్పీ ఎం.రామచంద్రుడు తెలిపారు.