క్రైమ్/లీగల్

కథువా రేపిస్టులకు శిక్షలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, జూన్ 10: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా గ్యాంగ్‌రేప్ కేసులో ఆరుగురు కామాంధులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. అందులో ముగ్గురికి యవజ్జీవ కారాగార శిక్ష విధించారు.
సాంజీరామ్, దీపక్ ఖజూరియా, పర్వేష్ కుమార్‌కు జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఇక ఇదే కేసులో దోషులైన సబ్‌ఇన్స్‌స్పెక్టర్ ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్ వర్మకు ఐదేళ్ల చొప్పున జైలుశిక్ష ఖరారు చేసింది. 2018లో జమ్మూకాశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది. ఈభయానక ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళననలు వ్యక్తమయ్యాయి. సభ్యసమాజం తలదించుకునే కథువా గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురిని అభియోగాలు నమోదయ్యా యి. ప్రధాన నిందితుడు సంజీరామ్ కుమారుడు విశాల్‌ను కోర్టు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ విడుదల చేసింది. మిగతా ఆరుగుర్ని దోషులుగా కోర్టు తీర్పునిచ్చిందని బాధిత కుటుంబం తరపున వాదించిన ఫరూఖీఖాన్ వెల్లడించారు. సోమవారం తీర్పు వెలువడుతుందన్న సమాచారం అందుకున్న మీడియా పెద్ద ఎత్తున కోర్టు వెలుపల వేచిఉంది. ఆలయ వ్యవహారాలు చూసే సాంజీరామ్, ప్రత్యేక పోలీసు అధికారి దీపక్ ఖజురియా, పర్వేష్‌కుమార్, ఎస్సై ఆంనద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్‌రాజ్, ప్రత్యేక పోలీసు అధికారి సురేంద్ర వర్మను కోర్టు దోషులుగా తీర్పునిచ్చింది. నేరపూరిత కుట్ర, హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలు ధ్వంసం వంటి సెక్షన్ల కింద న్యాయస్థానం విచారించి శిక్షలు వేసిందని లాయర్ తెలిపారు. ఆనంద్ దత్తా, తిలక్‌రాజ్, సురేంద్ర వర్మ పోలీసులై ఉండి సాక్ష్యాలు ధ్వంసం, తారుమారు చేయడానికి ప్రయత్నించారని కోర్టు నిర్ధారించింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు తన తీర్పును వెలువరించింది. ఓ బాల నేరస్తుడితోపాటు మొత్తం ఎనిమిది మందిపై జమ్మూకాశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 2018 ఏప్రిల్‌లో 15 పేజీల చార్జిషీట్ అందజేశారు. 2018 జనవరి 10న సంచార తెగకు చెందిన బాలిపై ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. గుర్రాలను మేపడానికి వెళ్లిన ఆ పాపను ఓ చిన్న గుడిలో బంధించిన దుర్మార్గులు తమ పశువాంఛను తీర్చుకున్నారు. ఒకరితరువాత ఒకరు అత్యాచారం చేసిన ఘాతుకులు రాయితో తలపై మోదీ దారుణంగా చంపేశారు. కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరోజే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక మృతదేహాం 17వ తేదీన పొలంలో కనిపించింది. సాంజీరామ్‌మే కీలక నిందితుడిగా కోర్టు నిర్ధారించింది. జమ్మూకాశ్మీర్‌లో కోర్టులో కాకుండా బయట రాష్ట్రంలో విచారించాలని బాధితురాలి తల్లిదండ్రులు చేసిన అభ్యర్థన మేరకు పఠాన్‌కోట్‌కు బదిలీ చేశారు. గత ఏడాది జూన్ మొదటి వారం నుంచి రోజువారీ విచారణ పఠాన్‌కోట్ జిల్లా, సెషన్స్ కోర్టులో జరిగింది. కేసును జమ్మూకాశ్మీర్ నుంచి బదిలీ చేయాలని 2018 మే 7న సుప్రీం కోర్టు ఆదేశించింది. యావత్ భారత్‌ను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ కేసులో జేకే చోప్రా, ఎస్‌ఎస్ బస్రా, హర్మీందర్ సింగ్ బృందం ప్రాసిక్యూషన్ నిర్వహించింది. జమ్మూకాశ్మీర్ క్రైమ్‌బ్రాంచ్ రామ్, అతడి మైనర్ మేనల్లుడు, కుమారుడు, విశాల్, ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు ఖజూరియా, వర్మను అరెస్టు చేసింది. కేసును మాఫీ చేయడానికి రాజ్, దత్తాకు సాంజీరామ్ 4 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చాడు. కీలక సాక్ష్యాలు ధ్వంసం చేసినందుకు ఆ ఇద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు. ఎమిమిది మంది నిందితుల్లో ఏడుగురిపై చార్జిషీట్ దాఖలయింది. జవైనల్ వయస్సుకు సంబంధించి కేసు జమ్మూకాశ్మీర్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున శిక్ష ఖరారు చేయలేదు. రణ్‌బీర్ ప్యానల్ కోడ్(ఆర్‌పీసీ)లోని సెక్షన్ 120-బీ(నేరపూరిత కుట్ర), 302(హత్య), 376-డీ(గ్యాంగ్‌రేప్) సెక్షన్ల కింద కేసు నమోదుచేసి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. ఆర్‌పీసీలోని 328(సాక్ష్యాల ధ్వంసం) సెక్షన్ కింద అభియోగాలు నమోదయ్యాయి. పోలీసు ఉద్యోగులు రాజ్, దత్తాపై 161 సెక్షన్ కింద అదనంగా కేసు నమోదు చేశారు. కేసు బదిలీకి సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిందితులందర్నీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జైలులో ఉంచారు. కోర్టు తీర్పు దృష్ట్యా గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఒక్కొక్కడిన ప్రవేశపెట్టారు.
ఉరిశిక్ష వేయాలి
కథువా ముద్దాయిలకు ఉరిశిక్ష వేయాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ డిమాండ్ చేశారు. పఠాన్‌కోట్ న్యాయస్థానం తీర్పును జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయాలని ఆమె సూచించారు. యావజ్జీవ శిక్షను స్వాగతిస్తున్నామని అయితే ఘాతుకానికి పాల్పడ్డ వారికి ఉరే సరైన శిక్ష అని ఆమె పేర్కొన్నారు.
చిత్రాలు.. కట్టుదిట్టమైన భద్రత మధ్య పఠాన్‌కోట్ కోర్టుకు కథువా ముద్దాయిలు.
(ఇన్‌సెట్లో) ప్రధాన ముద్దాయి సాంజీరాం