క్రైమ్/లీగల్

బెయిల్ కోసం హైకోర్టుకు రవిప్రకాశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మరోమారు విచారణ జరగనుంది. ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా చేసిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నారు. పోలీసుల అరెస్టును అడ్డుకోవాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు నిరాకరించింది. దాంతో రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ అంశం హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. దాంతో మరో మారు హైకోర్టులో రవిప్రకాశ్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. రవిప్రకాశ్‌ను అరెస్టు చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతనే అదుపులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొనడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. దానిపై ప్రభుత్వ వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం ప్రభుత్వం వాదనలు వినిపించే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు పూనుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.