క్రైమ్/లీగల్

ఐటీ గ్రిడ్ అశోక్‌కు హైకోర్టులో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ డాకవరపు అశోక్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆధార్, ఇతర వ్యక్తిగత వివరాలను చౌర్యం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న అశోక్‌కు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆయనకు పలు షరతులను విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా అదేశించింది. రోజూ పోలీసుల ఎదుట హాజరుకావాలని షరతు విధించింది. మాదాపూర్‌లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిందని టీ లోకేశ్వర్‌రెడ్డి మార్చి 2వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, ఎస్‌ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు సాగించారి. ఐటీ గ్రిడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిందని మాదాపూర్, ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఐటీ గ్రిడ్స్‌కు సంబంధించిన కేసులన్నీ కలిపి విచారణ జరిపేందుకు ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని అశోక్ వాదించారు. అయితే అశోక్ ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని, ఇప్పటికే విచారణకు సహకరించడం లేదని పోలీసుల తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో అశోక్‌కు పలు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసులో అశోక్ సతీమణి శ్రీలక్ష్మీ కూడా నిందితురాలిగా ఉన్నారు. ఇద్దరూ తొలుత బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే రంగారెడ్డి కోర్టు వారి అభ్యర్థనను తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించారు. మేలో ఈ పిటిషన్లపై విచారణ జరిగినపుడు జస్టిస్ పీ నవీన్‌రావు ఈ అంశంపై ప్రభుత్వ వాదనలు వినిపించాలని ఆదేశించారు. ప్రభుత్వం ముందస్తు బెయిల్‌పై ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.