క్రైమ్/లీగల్

ఏ-1 రాకేష్‌రెడ్డి, ఏ-2 విశాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారులు 23 పేజీల్లో చార్జిషీట్‌లో హత్యకు సంబంధించిన పలు కీలక అంశాలను పొందుపరిచారు. జయరాం కేసును దర్యాప్తు అధికారులు నాలుగు నెలల్లో సాక్షుల విచారణతోపాటు చార్టీషిట్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 30 రాత్రి జయరాం హత్యకు గురయ్యారు. హత్య కేసులో నిజానిజాలు తేల్చాలని జయరాం భార్య పద్మశ్రీ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులే విచారణ చేపట్టాలని ఆమె కోరారు. హత్య కేసులో
ప్రధాన నిందితుడుగా రాకేష్‌రెడ్డిని ఏ-1గా, అతడి స్నేహితుడు విశాల్‌ను ఏ-2గా దర్యాప్తు అధికారులు చార్టీషీట్ దాఖలు చేశారు. పోలీస్ అధికారుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చడం గమనార్హం. జయరాం మేనకోడలు శిఖాచౌదరిని కూడా నిందితురాలిగా చార్జిషీట్‌లో చేర్చారు. ఈ కేసులో దాదాపు 73 మంది సాక్షుల పేర్లను ప్రస్తావించారు. జనవరి 30వ తేదీన జయరాంను రప్పించడానికి హనీట్రాప్ ద్వారా రాకేష్‌రెడ్డి స్నేహితుడు సూర్యప్రసాద్ పిలిచినట్లుగా నాటకమాడినట్లు పోలీస్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇంటికి వచ్చిన జయరాంను దాదాపు రూ.4.5 కోట్లు ఇవ్వాలని రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశాడని, అందుకు బాండ్లపై జయరాంతో సంతకాలు చేయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఒప్పందం ప్రకారం రూ.4.5 కోట్లు విడతల వారీగా నెలనెలా రూ.50 లక్షలు ఇస్తానని జయరాం హామీ ఇచ్చినట్లు విచారణలో తెలిందన్నారు. రాకేష్‌రెడ్డి, విశాల్ కలసి చిత్రహింసలు పెట్టి చివరికి ముఖంపై తలదిండుతో ఊపిరి ఆడకుండా చేయడంతో జయరాం మృతి చెందినట్లు చార్జీషీట్‌లో పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి పోలీస్ అధికారుల సలహాలను రాకేష్‌రెడ్డి తీసుకున్నట్లు వెల్లడించారు. జనవరి 31వ తేదీన నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం చిత్రీకరించి జయరాం శవంతో కారును అక్కడే వదిలేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. నందిగామకు వెళ్లక ముందు జయరాం మృతదేహాన్ని కారులో వేసుకుని నేరుగా నల్లకుంట పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లాడు. కేసు నుంచి ఎట్లా బయటడాలని పోలీస్ అధికారులతో రాకేష్‌రెడ్డి చర్చించడం పోలీస్ శాఖను సైతం విస్మయానికి గురి చేసింది. ఈ కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సిఐ శ్రీనివాసులు, రాయదుర్గం సీఐ రాంబాబును ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి తప్పించారు. ఈ కేసులో ఏ-1గా రాకేష్‌రెడ్డి, ఏ-2గా విశాల్, ఏ-3గా రాకేష్‌రెడ్డి ఇంటి వాచ్‌మెన్ శ్రీనివాసులు, ఏ-4గా నగేష్ (రౌడీ) ఏ-5గా సూర్యప్రసాద్ (నటుడు), ఏ-6గా కిషోర్ (సూర్యప్రసాద్ స్నేహితుడు) ఏ-7గా సుభాష్‌రెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి), ఏ-8గా బీఎన్ రెడ్డి (టీడీపీ నేత), ఏ-9గా అంజిరెడ్డి (రియల్టర్), ఏ-10గా నల్లకుంట సిఐ శ్రీనివాసులు, ఏ-11గా రాయదుర్గం సీఐ రాంబాబు, ఏ-12గా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పేర్లను చేర్చారు. అలాగే జయరాం మేనకోడలు శిఖారెడ్డి పేరునూ చార్జీషీట్‌లో చేర్చారు.

చిగురుపాటి జయరాం (ఫైల్‌ఫొటో )