క్రైమ్/లీగల్

విలీనంపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షంలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. స్పీకర్ జారీ చేసిన సీఎల్పీ విలీనం ఉత్తర్వులను రద్దుచేయాలనలి కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్లపై మంగళవారం నాడు విచారణ జరపుతామని హైకోర్టు తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. సీఎల్పీ తీర్మానం లేకుండానే 12 మంది ఎమ్మెల్యేలు కోరడం, స్పీకర్ దానిని యథాతథంగా ఆమోదించడం చట్టబద్ధంగా లేదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టి వేయాలని పిటీషన్‌లో కోరారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు కోరగా, మంగళవారం నాడు విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.