క్రైమ్/లీగల్

జైళ్లలో పరిమితికి మించి ఖైదీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీలు పరిమితి కంటే 600 శాతం అధికంగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిం ది. దేశం మొత్తం మీద జైళ్లలో పరిమితికి మించి 1300 మంది ఖైదీలు ఉం టున్నారన్న సమాచారం తెలుసుకున్న కోర్టు ‘ఖైదీలను జంతువుల మాది రిగా జైళ్లలో కుక్కేయడమేంటంటూ’ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘జైళ్ల సం స్కరణల్లో మనం చేయాల్సిందేమం టే, ఖైదీలను జైళ్లలో ఉంచలేకపోతే మనం వారిని విడుదల చేయాలి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయం లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి దురదృష్టకరమైన అంశంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడమేంటని ప్రశ్నించింది. జైళ్లలో ఖైదీల రద్దీ విషయాన్ని పరిష్కరించడానికి అవసరమైన కార్యాచరణ ప్ర ణాళికను రూపొందించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడంపై కోర్టు ధిక్కార నోటీసు ను జారీ చేయాల్సి ఉంటుందని ఆ యా రాష్ట్రాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ప్రిజన్స్)లను హెచ్చరించిం ది. ‘ఖైదీలకూ హక్కులుంటాయి. జంతువుల మాదిరిగా వారిని జైల్లో కుక్కడమేంటి?’ అని జస్టిస్ ఎం.బి. లోకుర్, దీపక్ గుప్తాలతో కూడిన ధ ర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటినుంచి రెండు వారాల్లోగా అటువంటి ప్రణాళికపై వివరాలు కోర్టుకు సమర్పించనట్లయితే ‘కోర్టు ధిక్కార నోటీసులు’ జారీ చేయక తప్పదని కోర్టు హెచ్చరించింది. ఇదే సమయంలో నల్సా యూనివర్సిటీ సమర్పించిన నివేదిక ను ప్రస్తావించింది. జైళ్లలో చాలా పో స్టులు ఖాళీగా పడి వున్నాయని ఆ ని వేదిక పేర్కొంది. వీటి భర్తీ విషయం లో తీసుకున్న చర్యల వివరాలను త మకు తెలపాలని కోర్టు ఆయా రాష్ట్రా ల డీజీపీ(జైళ్లు)లను ఆదేశించింది.