క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో వీఆర్వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్‌పల్లి, జూన్ 10: భూమి పట్టా మార్పిడి కోసం రూ.3వేల లంచం డిమాండ్ చేసిన వీఆర్వో బాపయ్య సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి తన తండ్రి చనిపోవడంతో రాజేశ్వర్‌పేటలో తన తండ్రి పేరు మీద ఉన్న 23 గుంటల భూమిని తన పేరుమీద మ్యుటేషన్ చేసి పట్టాపాసు బుక్కులో నమోదు చేయమని మీసేవలో గత నెల 16న దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఎన్నిసార్లు వీఆర్వోను కలిసి అడిగిన పట్టాపాసు బుక్కు చేయకపోవడంతో గతనెల మే 29న మళ్లీ వీఆర్వో బాపయ్యను కలిసి అడగడంతో రూ.3 వేలు లంచం డిమాండ్ చేసి పైసలు ఇస్తేనే పని చేస్తానని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో మహమ్మద్ విసుగు చెంది మే 31న కరీంనగర్‌లోని అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు.
దీంతో అవినీతి నిరోధకశాఖ అధికారులు వీఆర్వో బాపయ్యపై నిఘావేసి ఉంచారు. సోమవారం ఏసీబీ అధికారుల సూచన మేరకు మహమ్మద్ మేడిపల్లి వీఆర్వో బాపయ్య అడిగిన రూ.3 వేలను మెట్‌పల్లిలోని తహశీల్ కార్యాలయంలోకి వెళ్లి ఇచ్చాడు. బాపయ్య వాటిని తీసుకోగానే కార్యాలయం బయట మాటువేసిన కరీంనగర్ అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ భద్రయ్య, ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, వేణుగోపాల్, రాములు వారి సిబ్బంది హుటాహుటిన వచ్చి వీఆర్వో బాపయ్యను పట్టుకుని పరీక్షించగా, అతను లంచం తీసుకున్నట్టు నిర్ధారణ అయయంది. దీంతో డీఎస్పీ భద్రయ్య వీఆర్వోను ఆదుపులోకి తీసుకొని విచారించి కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో బాపయ్యను హాజరు పరుస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.