క్రైమ్/లీగల్

నకిలీ పత్తి విత్తన మాఫియా ఆటకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జూన్ 10: కుమరం భీం జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు ఆసిఫాబాద్, సిర్పూర్ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ప్రతి ఏటా నకిలీ పత్తివిత్తనాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని జిల్లా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఓ వైపు బిజి-3 పత్తి విత్తనాల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు విత్తన మాఫియాపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా పోలీసులు జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో నిషేధిత పత్తి విత్తన ప్యాకెట్లతో పాటు, భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి సోమవారం పోలీసుప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 3న సిర్పూర్ (టి)కి చెందిన మాడుగుల సుబ్బారెడ్డి నుంచి రూ.2 లక్షల విలువ చేసే 260 నకిలీ పత్తి విత్తనా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే పట్టణానికి చెందిన ముఠా సంతోష్ అనే వ్యక్తి ఇంటిని తనిఖీ చేయగా రూ.9.300 విలువ చేసే 10 విత్తన ప్యాకెట్టు, పేర శేఖర్ అనే వ్యక్తి వద్ద రూ.18వేల వేలువ చేసే 12 కిలోల లూజు పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత లోతైన విచారణ జరిపిన పోలీసులకు ఏజెంట్ల సహాయంతో జిల్లాలో వ్యాపారాన్ని సాగిస్తున్న అసలు సూత్రధారి మహారాష్టల్రోని బల్హార్షాలో నివసిస్తున్న కట్ట హనుమంత్ రావుఅని తేలింది. దీంతో ఈనెల 9న జిల్లాపోలీసులు బల్హార్షాలోని కట్టహనుమంత్‌రావు కారును తనిఖీ చేయగా రూ.34 వేల విలువ చేసే 40 నిషేధిత పత్తివిత్తన ప్యాకెట్లతో పాటు, రూ.33.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రధాన సూత్రధారి కట్టహనుమంత్‌రావుతో పాటు, అతనికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న మాడుగుల సుబ్బారెడ్డి, ముఠా సంతోష్, పేర శేఖర్‌లను అరెస్టు చేసి సోమవారం రిమాండ్ చేశారు. మరో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ విత్తనాలు, నగదును విలేఖరుల ముందు ప్రవేశ పెట్టారు.
నకిలీ విత్తనాల బారిన పడి మోసపోవద్దు
నిషేధిత పత్తివిత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి కోరారు. సోమవారం విలేఖర్లతో మాట్లాడిన ఆయన పర్యావరణానికి హాని కలిగించే బిజి-3 విత్తనాలను ప్రభుత్వం నిషేధించిందన్నారు. వీటి వాడకం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. కావున రైతులు వ్యవసాయ శాఖ సూచించిన డీలర్ల వద్దే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. నకిలీ విత్తన వ్యాపారుల సమాచారం తెలిస్తే వివరాలు అందించాలన్నారు. విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, కౌటాల సీఐ మోహన్ పాల్గొన్నారు.
చిత్రాలు.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మల్లారెడ్డి
*పోలీసుల అదుపులో నిందితులు