క్రైమ్/లీగల్

ప్రాథమిక హక్కులపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతర వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెట్టిన కేసుకు సంబంధించి జర్నలిస్టు ప్రశాంత్ కనూజియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, అజయ్ రస్తోగిల వెకేషన్ బెంచ్ మంగళవారం ఇచ్చిన తీర్పులో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా ఉండే హక్కు ‘పవిత్రమైనది, పరిష్కరించలేని అంశం’గా పేర్కొంది. బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన జర్నలిస్టు చేసిన అభ్యంతరకమైన వ్యాఖ్యలను సమర్థించినట్లు కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా మాట్లాడే హక్కును రాష్ట్ర ప్రభుత్వం అతిక్రమించడానికి వీల్లేదని బెంచ్ స్పష్టం చేసింది. లక్నోలో ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ ‘తనను వివాహం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సందేశాన్ని పంపించానని’ పేర్కొన్న వీడియోను జర్నలిస్టు కనూజియా ఫేస్‌బుక్‌తో పాటు ట్విటర్‌లో కూడా షేర్ చేశాడు. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ శుక్రవారం రాత్రి యూపీలోని హజ్త్‌గ్రంజ్ పోలీసులు జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా జర్నలిస్టు షేర్ చేసిన పోస్టులు ఉన్నాయనీ, ఇది పూర్తిగా అభ్యంతరకరమని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అరెస్టుపై బెయిల్ మంజూరు చేసినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి బెంచ్ స్పష్టం చేసింది. తన భర్త అరెస్టును సవాల్ చేస్తూ జర్నలిస్టు భార్య జగీషా అరోరా హెబియస్ కార్పస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో వ్యక్తికి బెయిల్ ఏ విధంగా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ కోర్టుకు చెప్పారు. ఈ కేసులో 11 రోజులు జ్యుడీషియల్ కస్టడీ ఏ విధంగా విధించారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ‘జర్నలిస్టు చర్యలను కోర్టు సమర్థించడం లేదు.. అయితే తమకు అతని అరెస్టు ఇబ్బందికరంగా మారింది.. తక్షణమే అతనికి విడుదల చేయండి’ అంటూ బెంచ్ ఆదేశించింది.
జర్నలిస్టు అరెస్టుపై
రాహుల్, ప్రియాంక ఖండన
జర్నలిస్టు కనూజియాతో పాటు టీవీ చానల్ ఎడిటర్‌ల అరెస్టును ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు ఇలా అరెస్టులు చేసుకొంటూ పోతే న్యూస్‌పేపర్లు, చానళ్లు తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చర్యలు అసహ్యంగా ఉన్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వ విధానాలు జర్నలిస్టుల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రైతు, జర్నలిస్టు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలని రాహుల్, ప్రియాంక హితవు పలికారు.
చిత్రం...న్యూఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న
పాత్రికేయుడు ప్రకాష్ కనోజియా భార్య జగీషా అరోరా.