క్రైమ్/లీగల్

వితంతువుల సంక్షేమం వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: వితంతువులు, అనాథ మహిళల అభ్యున్నతికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాలిక వివరాలను కేంద్రానికి పంపకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చే సింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన అంశమని పేర్కొంది. కేంద్ర మహిళా,శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ, కొన్ని రాష్ట్రాలు ఈ అంశంపై సమాచారాన్ని పంపినా అది అసంపూర్తిగా ఉన్నదంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రెండు వారాల్లోగా కేంద్రానికి పంపాలని, జ స్టిస్ ఎం.బి. లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. కొన్ని రాష్ట్రాలు అసలు సమాచారం పంపకపోవడం, మరికొన్ని అసంపూర్తి సమాచారాన్ని పంపి చేతులు దులుపుకోవడం దురదృష్టకరమంటూ ధర్మాస నం ఆవేదన వ్యక్తం చేసింది.
వితంతువులు, అనాథ మహిళల వి షయంలో చేపడుతున్న సంక్షేమ చ ర్యల వివరాలు తెలపాలని అంతకుముందు సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాల కమిషనర్స్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్ల్యు), సం బంధిత మంత్రిత్వ శాఖలను కోరింది. ‘రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి సమాచారం సేకరించడంలో కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు ఎన్‌సిడబ్ల్యు సహకరిస్తుందని భావిస్తున్నాం’ అంటూ కోర్టు దీని కి సంబంధించిన విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా వితంతువులు, అనాథలైన మహిళలకోసం వివిధ రాష్ట్రాలు అనేక పథకాలను అ మలు పరుస్తున్నాయని, వీటన్నింటినీ క్రోడీకరించాల్సిన అవసరం ఉన్నదని అంతకుముందు ఎన్‌సిడబ్ల్యు తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ధ ర్మాసనం స్పందిసూ, ఈ పథకాలన్నింటినీ విశే్లషించి, ‘ఒకే సముచితమైన, అమలుచేయదగ్గ నమూనా పథకాన్ని రూపొందించాలని’ ఆదేశించింది.