క్రైమ్/లీగల్

ఎయిమ్స్ కాంట్రాక్టర్‌పై ఎఫ్‌ఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ఎయిమ్స్‌లోని కేఫరేటిరియా కాంట్రాక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ప్రైవేటు కాంట్రాక్టర్ ఆహారం, ఇతర తినుబండారాల ధరలను విపరీతంగా పెంచి, సిబ్బందిని, రోగులను ఇబ్బందులపాలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. చాలాకాలంగా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేఫరేటియా కాంట్రాక్టర్‌పై ఎయిమ్స్ ఉద్యోగుల సంఘం నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, అక్కడ కూడా సరైన స్పందన లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్ మోసాలకు పాల్పడుతున్నట్టు ఉద్యోగులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 2015 నుంచి 2018 ఆర్థిక సంవత్సరం వరకు కాంట్రాక్ట్‌ను సంపాదించిన సదరు కేటరర్ తప్పుడు డాక్యుమెంట్లతో మరోసారి కేఫటేరియా బిడ్‌ను దక్కించుకున్నాడని ఉద్యోగుల ఆరోపణ. అయితే, ఈ మోసం వెనుక కొందరు ఉద్యోగుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాగా, ఢిల్లీ హైకోర్టు కేసు విచారణ నిమిత్తం ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విజేతా సింగ్ రావత్ ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టారు. వారి నుంచి నివేదిక అందిన తర్వాత ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణ చేపడుతుంది.
కాగా, కేఫటేరియాలో తినుబండారాలను భారీ ధరలకు అమ్మడంతో సిబ్బంది, రోగులు చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. కేఫటేరియా భవనాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నివిధాలుగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దినప్పటికీ అక్కడి ధరలను చూసి అంతా బెంబేలెత్తుతున్నారు. గత నెల 15వ తేదీన క్యాటరర్ అకస్మాత్తుగా ధరలను భారీగా పెంచడంతో ఈ అంశం కోర్టు వరకు వెళ్లింది. ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో త్వరలోనే ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.