క్రైమ్/లీగల్

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూన్ 12: అజిత్‌సింగ్ నగర్ ఫ్లైఓవర్‌పై ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మద్యం తాగిన మత్తులో పగడాల దుర్గారావు, శివ, ఆరిఫ్ తమ బాక్సర్ బైక్‌పై సింగ్‌నగర్ నుండి నగరంలోని ఫుడ్ కోర్టుకు బయలుదేరారు. ఇదే సమయంలో గవర్నర్‌పేట వన్ డిపో ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉపల్ల ఆదాం, అతని బావమరిది రవికుమార్ పల్సర్ బైక్‌పై సింగ్‌నగర్‌లోని ఇంటికి బయలుదేరారు. అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి అతివేగంగా వస్తున్న పగడాల దుర్గారావు తన బైక్‌తో పల్సర్ బైక్‌ను ఢీకొన్నాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న దుర్గారావు, ఎదురు వైపు బైక్‌పై వస్తున్న రవికుమార్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో రోజు గడిస్తే గాని వారి పరిస్థితి ఏమిటనేది చెప్పలేమని వైద్యులు పేర్కొన్నట్లు అజిత్‌సింగ్‌నగర్ ఎస్‌ఐ రమేష్ వివరించారు.