క్రైమ్/లీగల్

బొగ్గుపొడి లారీ బోల్తా: నలుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్పల, జూన్ 12: అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. నార్పల మండలం మద్దలపల్లి సమీపంలో తాడిపత్రి-అనంతపురం రహదారిపై బొగ్గుపొడి లారీ టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పి ముందువెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని దానిపై బోల్తాపడింది. దీంతో మోటార్‌బైక్‌పై వెళ్తున్న వెంకటేశ్వరగుప్త, శివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ ఆరిఫ్‌ఖాన్, క్లీనర్ అమీన్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి-అనంతపురం ప్రధాన రహదారిలో నార్పల మండలం మద్దలపల్లి మలుపు వద్ద బుధవారం మధ్యాహ్నం హర్యానాకు బొగ్గుపొడి లోడుతో వెళ్తున్న లారీ టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పి ముందువెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని బోల్తాపడింది. దీంతో లారీ కింద పడి అనంతపురం జిల్లా తాడిమత్రి మండలం చిల్లకొండయ్యగారిపల్లికి చెందిన వెంకటేశ్వరగుప్త(55), శివారెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలు రెండు ఛిద్రమయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ ఆరీఫ్‌ఖాన్(40), క్లీనర్ అమీన్‌కుమార్(25)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతులిద్దరూ రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా కారుల్ల గ్రామస్తులు. చిల్లకొండయ్యగారిపల్లికి చెందిన వెంకటేశ్వరగుప్త, శివారెడ్డి బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువాతపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.