క్రైమ్/లీగల్

ఏవోబీలో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై రామవరం/సీలేరు, జూన్ 12: తూర్పు-విశాఖ సరిహద్దుల్లోని ఏవోబీలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు గ్రేహౌండ్స్ దళాలు మంగళవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలం గుర్తేడు పోలీసుస్టేషన్ పరిధిలోని పాతకోట పంచాయతీ కొప్పులకోట గ్రామ సమీపంలోని చేపకొండ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోలు తారసపడటంతో ఈ ఎదురుకాల్పులు సంఘటన చోటుచేసుకంది. పోలీసు బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టడంతో మావోయిస్టులు సంఘటనాస్థలంలో 15 కిట్ బ్యాగ్‌లు, మూడు తుపాకులను వదిలి తప్పించుకున్నారు. మెరుగైన రహదారి, రవాణా సౌకర్యంలేని దట్టమైన అటవీప్రాంతం కావడంతో బుధవారం ఉదయం వరకు సమాచారం బయటకు రాలేదు. సుమారు 18 మంది మావోయిస్టులు సంఘటన నుంచి తప్పించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. లభ్యమైన మావోల సామాగ్రిని గ్రేహౌండ్స్ పోలీసులు విశాఖ తరలించారు.
ఏవోబీలో భారీ ఎత్తున పోలీసు కూంబింగ్
వై రామవరం మండలం గుర్తేడు పోలీసుస్టేషన్ పరిధిలోని పాతకోట పంచాయతీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనతో బుధవారం తూర్పు-విశాఖ జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమై కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. తప్పించుకున్న మావోలను వెంటాడుడూ ఒకపక్క తూర్పుగోదావరి జిల్లా ఏఎన్‌ఎస్ పోలీసు బలగాలు, మరోపక్క విశాఖ జిల్లాకు చెందిన గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ ప్రారంభించాయి. దీనిలో భాగంగా బుధవారం భారీఎత్తున పోలీసు బలగాలు అటవీ ప్రాంతంలో ప్రవేశించాయి.

చిత్రాలు.. పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన అటవీ ప్రాంతం,
* కూంబింగ్‌కు బయలుదేరిన పోలీసు బలగాలు