క్రైమ్/లీగల్

విశాఖలో దొంగనోట్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 31: రైల్లో తరలిస్తున్న దొంగనోట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌లో ముద్రితమైన ఈ నోట్లు పశ్చిమబంగ నుంచి తరలిస్తున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను విశాఖ రైల్వే స్టేషన్‌లో శనివారం పట్టుకున్నారు. నోట్ల విలువ రూ.10.2 లక్షలుగా డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ చేరుకోగానే ముందుగా ఉన్న సమాచారం మేరకు డీఆర్‌ఐ సిబ్బంది దాడి చేశారు. తల దిండులో దాచి ఉంచిన రూ.2000 నోట్ల కట్టలు ఐదింటిని స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు ప్రశ్నించగా బెంగళూరుకు దొంగ నోట్లను తరలిస్తున్నట్టు అంగీకరించారన్నారు. త్వరలో కర్నాటకలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దొంగనోట్లను సులువుగా మార్చుకోవచ్చని భావించినట్టు నిందితులు వెళ్లడించారన్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి పశ్చిమబంగ, మాల్దాకు కొద్దికిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరక్కా ప్రాంతంలో తమకు ఈ నోట్లు అందజేసినట్టు నిందితులు వెల్లడించారన్నారు.