క్రైమ్/లీగల్

రెండోరోజూ ఎన్‌ఐఏ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు, జూన్ 13: నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఐఎస్‌ఐఎస్ కేరళ-తమిళనాడు మాడ్యూల్ కేసులో వరుసగా రెండో రోజు గురువారం ఇక్కడ దాడులు కొనసాగించింది. బుధవారం నగరంలోని ఏడు ప్రదేశాల్లో తనిఖీలు జరిపిన ఎన్‌ఐఏ విచారణ కోసం ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. ప్రధాన నిందితుడు, శ్రీలంకలోని ఈస్టర్ సండే పేలుళ్ల సూత్రధారి జహ్రా హషీమ్‌కు ఫేస్‌బుక్ స్నేహితుడు అయిన మహమ్మద్ అజారుద్దీన్‌ను అరెస్టు చేసింది. రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన అధికారులు మహమ్మద్ హుస్సేన్, షాజహాన్, హయతుల్లా అనే మరో ముగ్గురు వ్యక్తుల ఇళ్లలో గురువారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి తనిఖీలు కొనసాగిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్‌ఐఏ మే 30వ తేదీన కోయంబత్తూరుకు చెందిన అజారుద్దీన్, షేక్ హిదయతుల్లా, అక్రం సింధా, అబూబాకర్ ఎం, సాదం హుస్సేన్, ఇబ్రహీం అలియాస్ షాహిన్‌లకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసింది. వీరంతా దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులు జరపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఇందులో భాగంగా యువతను నియమించుకుంటున్నారని ఎన్‌ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ఎన్‌ఐఏ అధికారులు బుధవారం తనిఖీల సందర్భంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు, నేరాన్ని నిరూపించే ఇతర సామగ్రి వంటి అనేక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తాను నిర్బంధించిన వారి ఉద్దేశం దక్షిణ భారతంలో ప్రత్యేకించి తమిళనాడు, కేరళల్లో ఉగ్రవాద దాడులు జరపడానికి దయనీయ పరిస్థితుల్లో ఉన్న యువతను ఐఎస్‌ఐఎస్ లేదా డాయిష్ సంస్థల్లోకి రిక్రూట్ చేసుకోవడమేనని ఎన్‌ఐఏ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మాడ్యూల్ నాయకుడు అయిన అజారుద్దీన్ ‘ఖిలాఫాజీఎఫ్‌ఎక్స్’ అనే ఫేస్‌బుక్ పేజీని నిర్వహిస్తున్నాడని, దాని ద్వారా ఐఎస్‌ఐఎస్ భావజాలాన్ని ప్రచారం చేస్తూ వచ్చాడని ఎన్‌ఐఏ తెలిపింది.