క్రైమ్/లీగల్

నానాకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో వెటరన్ నటుడు నానాపటేకర్‌కు ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో ఎలాంటి ఆధారాలు లభించని కారణంగా ఆయనపై విచారణ కొనసాగించలేమని ముంబయి పోలీసులు కోర్టుకు తెలియజేశారు. గత సంవత్సరం తనపై లైంగిక వేధింపులకు నానాపటేకర్ పాల్పడ్డారని తనుశ్రీ దత్తా ‘మీ టూ..’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు సంచలనం రేపిన సంగతి విదితమే. కాగా, సబర్బన్ ఒశివారా పోలీసులు ఈ కేసుకు సంబంధించి బుధవారం అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ‘బీ-సమ్మరీ’ నివేదికను సమర్పించారు. డీసీపీ పరంజిత్ సింగ్ దాహియా గురువారం విలేఖరులతో మాట్లాడుతూ నానాపటేకర్ లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్ల ఆయనపై ఎటువంటి చార్జిషీట్ ఫైల్ చేయలేమని కోర్టుకు వెల్లడించినట్లు చెప్పారు. కాగా, కోర్టుకు పోలీసులు వెల్లడించిన అంశాన్ని నానా పటేకర్ లాయర్ అనికేత్ నికం స్వాగతించారు. అయితే, ఈ కేసులో పోలీసులు తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబించారని తనుశ్రీదత్తా లాయర్ నితిన్ సత్‌పుతే ఆరోపించారు. దీనిపై తనకు కానీ తన క్లయింట్‌కు కానీ పోలీసుల నుంచి అధికారిక సమాచారం అందలేదని నితిన్ వెల్లడించారు. ‘దీనిని మేం వ్యతిరేకించవచ్చు.. మా వాదనలు విన్న తరువాత కోర్టు సంతృప్తి చెందితే మరోసారి విచారణకు పోలీసులను ఆదేశించే అవకాశం కచ్చితంగా ఉంటుంది’ అని తనుశ్రీ లాయర్ స్పష్టం చేశారు.