క్రైమ్/లీగల్

యువతిని వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, జూన్ 13: యువతిని ప్రేమించి మరొకరు పరిచయం కావడంతో అమె ఫోటోలు తీసుకుని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ రామాంతపూర్‌లో నివసించే కందేరి శ్రీ్ధర్ రావు(38) వ్యాపారీ. మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివసించే యువతి(31) ప్రైవేట్ ఉద్యోగి. 2013లో శ్రీ్ధర్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో శ్రీ్ధర్ మరో యువతితో తిరుగుతుండడంతో యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరినట్టు పోలీసులు తెలిపారు. శ్రీ్ధర్ ఈనెల 11న తనను కలసి, తాము కలసి ఉన్నప్పుడు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి, తమ కుటుంబ సభ్యులకు చూపిస్తానని యువతిని బెదిరించడంతో మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం అతని అరెస్టు చేసినట్టు తెలిపారు.