క్రైమ్/లీగల్

వ్యాపారి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూన్ 13: భాగస్వామి వేధింపులతో హోమ్ ఫుడ్స్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో పార్ట్‌నర్ చేసిన కుట్రకు అతను బలయ్యాడు. చందానగర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన టీవీ శ్రీనివాస రావు (47), స్నేహితుడు శ్రీనివాస్ బాబ్జీ.. కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని దూబే కాలనీలో ఏడాది క్రితం తఅమడెర్ రన్న ఘోరే పేరుతో బెంగాలీ హోమ్ ఫుడ్స్ తయారీ సంస్థను నెలకొల్పారు. కొంత కాలంగా బాబ్జీ అతని మిత్రులు వెంకట్, కిశోర్ కలిసి మొత్తం వ్యాపారాన్ని తమకు అప్పగించాలని, లేకుంటే రూ.4.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బెదిరింపులు ఎక్కువ కావడంతో భయాందోళనలకు గురైన టీవీ శ్రీనివాస రావు(47) జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతునికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు తమ్మినేని వెంకటసాయి సాత్విక్ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు శ్రీనివాస్ బాబ్జీ, ఇతరులపై భారత శిక్షాస్మృతి చట్టం (ఐపీసీ) 306 కింద కేసు నమోదు చేశారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ బీ.రవీందర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ పాషా దర్యాప్తు చేస్తున్నారు.