క్రైమ్/లీగల్

గ్యాస్ సిలెండర్ల లారీ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 13: మైలవరంలో సంభవించిన అగ్నిప్రమాదంలో గ్యాస్ సిలెండర్ల లారీ దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండపల్లి నుంచి హెచ్‌పి గ్యాస్ సిలెండర్ల లోడుతో లారీ ఖమ్మం వెళ్ళి వాటిని అన్ లోడు చేసి తిరిగి వస్తుండగా, బుధవారం రాత్రి లారీ డ్రైవరు లారీని మైలవరంలో రోడ్డు పక్కన నిలిపివేశాడు. భోజనం చేద్దామనే ఉద్దేశంతో మైలవరంలో ఎల్బీఆర్సీఇ స్టేడియం పక్కన, దేవుడి చెరువు ఎదురుగా లారీని ఆపగా, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయ. స్థానికులు అప్రమత్తమై మైలవరం ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మైలవరం, కొండపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఖాళీ గ్యాస్ సిలెండర్లు కావడంతో పెద్దప్రమాదం తప్పింది. రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పారు. కాగా మంటలు ఎందుకు వ్యాపించాయి అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.