క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, మార్చి 31: విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం వెంకటరమణపేట సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మణం చెందారు. శృంగవరపుకోటలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విజయ్(12), లోకేష్(14) పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ద్విచక్రవాహనంపై వస్తున్న గౌరీ శంకర్(24) అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. ముగ్గురూ ద్విక్రవాహనంపై విశాఖ రోడ్డులో వెళ్తుండగా వెంకటరమణపేట సమీపంలో దిచక్రవాహనదారుడు ఆటోను ఓవర్‌టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జై ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. టూ వీలర్ నడుపుతున్న గౌరీశంకర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇతనిది విజయనగరం జిల్లా భోగాపురం. మృతి చెందిన చిన్నారులు ఇద్దరూ వేపాడ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన వారని ఎస్సై మహరూప్ తెలిపారు. చిన్నారుల మరణం స్థానికులను కలచి వేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ నాయకులు మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపి సహాయాన్ని అందిస్తామని తెలిపారు.