క్రైమ్/లీగల్

చౌతాలా ‘సెల్’లో మొబైల్ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా గదిలో మొబైల్ ఫోన్‌ను జైల్ అధికారులు కనుగొన్నారు. ఆకస్మిక తనిఖీలో ఫోన్ దొరికిందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఒక మొబైల్ ఫోన్‌తో పాటు చార్జర్, పొగాకు పౌచ్, వైర్‌ను తనిఖీల్లో స్వాధీనం చేసుకొన్నట్లు తీహార్ జైల్ అదనపు ఐజీ రాజ్‌కుమార్ వివరించారు. అయితే, చౌతాలాతో పాటు అదే సెల్‌లో ఉన్న ఖైదీ రమేష్ ఆ వస్తువులన్నీ తనవేనని అంగీరించాడని చెప్పారు. ఫోన్ నుంచి ఎక్కడి నుంచి కాల్స్ వెళ్లాయన్న అంశంపై దర్యాప్తు నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు మొబైల్‌ను అందజేసినట్లు అదనపు ఐజీ పేర్కొన్నారు. టీచర్ల నియామకాల్లో అవినీతికి పాల్పడిన కేసులో చౌతాలా తీహార్ జైలులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్నారు.