క్రైమ్/లీగల్

నకిలీ విత్తనాల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, జూన్ 14: ఆదిలాబాద్ జిల్ల్లాలో 25 లక్షల విలువైన నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో శుక్రవారం నకిలీ విత్తనాలను తరలిస్తున్న వాహనాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న నకిలీ విత్తనాల విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారి కైలాస్ తెలిపారు. ఇచ్చోడకు చెందిన విత్తనాల వ్యాపారి గుట్టుచప్పుడు కాకుండా వాహనంలో నకిలీ విత్తనాలను సరఫరా చేస్తుండగా సమాచారం అందుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, స్థానిక పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఇచ్చోడలోని పాత బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా వస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో నకిలీ విత్తన ప్యాకెట్లు బయటపడ్డాయి. గతంలో కూడా ఇచ్చోడ మండలంలో రెండుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న సంగతి విదితమే. అయితే ఈ పత్తి విత్తనాలను ఇచ్చోడకు చెందిన సాయి గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్‌కు సంబంధించినవని అనుమానాలు వ్యక్తమవుతుండగా దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. విత్తనాలు పట్టుకున్న వారిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అమృత్ రెడ్డి, స్థానిక సీఐ శ్రీనివాస్, ఏవో కైలాస్, స్థానిక ఎస్సై పుల్లయ్య ఉన్నారు.