క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ఇద్దరు మావోలు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 14: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంఖేర్ జిల్లాలో భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య సు మారు గంట సేపు కాల్పులు జరిగా యి. ఈ ఘటనలో మావోయిస్టులు ఆ ప్రాం తం నుండి తప్పించుకొని పోగా ఇద్దరు మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు 303 రైఫిల్, 301 బోర్ తుపాకీ, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లతో పాటు ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనపై కాంకేర్ ఎస్పీ కేఎల్ ధృవ్ స్పష్టత ఇచ్చారు. భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులే ఎదురు కాల్పులకు దిగారని, బలగాల వైపు ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదని పేర్కొన్నారు. కాగా సంఘటన అనంతరం అదనపు బలగాలను ఆ ప్రాంతానికి రప్పించి కూంబింగ్‌ను చేపడుతున్నారు. ఆ ప్రాంతాన్ని అంతా జల్లెడపడుతూ మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ ప్రాంతంలో గత 15రోజుల్లో నాలుగు సార్లు మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలోనే పోలీసులకు సహకరించే వారిపై మావోయిస్టులు, మావోయిస్టులకు సహకరించే వారిపై పోలీసులు నిఘా పెట్టి ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఇదే క్రమంలో మావోయిస్టులు చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా సరిహద్దులో భద్రతను మరింత పటిష్ట పరిచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు.