క్రైమ్/లీగల్

విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల్లో మావోల ప్లీనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జూన్ 14: విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు కీలక ప్రదేశంలో సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో ఆ ప్రాంతానికి గ్రేహౌండ్స్ బలగాలను తరలించారు. ఈ సమావేశంలో మావోయిస్టు కీలక నేతలు హాజరవుతారన్న సమాచారంతో ఎనిమిది గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా తనిఖీలు చేసారు. కప్పకొండ అటవీ ప్రాంతంలో మావోల ఆచూకీ లభ్యమైంది. అక్కడ ఎతె్తైన కొండపై మావోలు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం కొంత మంది మావోలు వంట చేసేందుకు సమీపంలో ఉన్న ఊట గెడ్డకు రావడం గుర్తించిన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. మావోలు కూడా ఎదురు కాల్పులకు దిగారు. కొంత సమయం గడిచాక చాకచక్యంగా మవోలు ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కూబింగ్ అనంతరం గ్రేహౌండ్స్ బలగాలు వెనుదిరిగాయి. సంఘటనా ప్రాంతంలో మావోల తుపాకులు, కిట్‌బ్యాగ్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.