క్రైమ్/లీగల్

కాంగ్రెస్ సీఎంల అలెర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), అశోక్ గెహ్లోట్ (రాజస్థాన్ ), భూపేష్ భగేల్ (చత్తీస్‌గఢ్) భవిష్యత్ కార్యచరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. రాష్టప్రతి భవన్‌లో శనివారం జరిగే నీతి ఆయోగ్ ఐదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సమావేశమై తమ ప్రభుత్వాలను కాపాడుకోవటంతోపాటు పార్టీని రక్షించుకునేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ నిర్ణయంతో పార్టీలో తలెత్తిన సంక్షోభం, ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ శాసన సభ్యులు ఇతర పార్టీల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్‌పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు కూడా ఇదే దారిలో నడవాలని ఆలోచిస్తున్నారు. అందుకే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు కర్నాటకలోని జేడీయూ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూడా పతనానికి చేరువలో ఉంది. బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంటే ఈ మూడు ప్రభుత్వాలు పడిపోవటం ఖాయం. అందుకే ఈ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి తామే చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ గత పదహారు రోజుల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సీనియర్ నాయకులను సైతం కలుసుకునేందుకు అంగీకరించటం లేదు. ఆయన చివరకు కాంగ్రెస్ ముఖ్యమంతులను సైతం కలుసుకునేందుకు అంగీకరించటం లేదు. కాంగ్రెస్ శాసన సభ్యులకు ఎర వేయటం ద్వారా తమ ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మొరపెట్టుకున్నా అధినేతలో చలనం లేదు. వారితో చర్చలు జరిపేందుకు రాహుల్ గాంధీ సుతరామూ అంగీకరించలేదు. మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్దు మూలంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్ని సార్లు వేడుకున్నా రాహుల్ పట్టించుకోలేదు. దీంతో ఆయన పార్టీ అధినాయకత్వంతో చర్చించకుండానే సిద్దు శాఖను మార్చివేశారు. అమరీందర్ సింగ్‌ను కలుసుకునేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ ఆ తరువాత శాఖ తగ్గింపునకు గురైన నవజ్యోత్‌సింగ్ సిద్దును కలుసుకోవటంతోపాటు దానికి సంబంధించిన ఫోటోను విడుదల చేసేందుకు అంగీకరించారు. ఈ పరిణామం అమరీందర్ సింగ్‌కు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ గత వారం లోక్‌సభకు ఎన్నికైన తన కుమారుడు నకుల్ నాథ్‌తో ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ ఆయనను కలుసుకునేందుకు తిరస్కరించారు. దీంతో కమల్‌నాథ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి చర్చలు జరిపారు. ఈ సహృద్భావ సమావేశానికి కమల్‌నాథ్ కుమారుడు సైతం హాజరు కావటం గమనార్హం. కాగా 17వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పట్ల రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉండటం తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయానికి ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, అశోక్ గెహ్లోట్ కారణమని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం కూడా తన కుమారుడి విజయం కోసం పని చేశారే తప్ప కాంగ్రెస్ సభ్యుల విజయానికి కృషి చేయలేదని రాహుల్ గాంధీ విమర్శించటం తెలిసిందే. రాహుల్ గాంధీ తమపై ఆరోపణలు చేయటం పట్ల కమల్‌నాథ్, అశోక్ గెహ్లోట్, చిదంబరం జీర్ణించుకోలేకపోతున్నారు.