క్రైమ్/లీగల్

ప్రేమ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 15: ప్రేమజంట ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనికి చెందిన సంతోష్ (27) ఏయిర్‌టెల్ కార్యాలయంలో స్టోర్ మేనేజర్‌గా విధులు నిర్వహించే వాడు. గత నాలుగు నెలల క్రితం అదే కార్యాలయంలో పనిచేసే అర్చనను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం శ్రీరామ్‌నగర్‌లోని ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. శనివారం వారు ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని నిర్జీవంగా కనిపించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ జరిపి మృతదేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.