క్రైమ్/లీగల్

పోలీసులకు పట్టుబడిన క్షుద్ర పూజారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, జూన్ 15: మండలంలోని ఎ కొండూరు తండాకు చెందిన భూక్యా సూర్యం ఇంట్లో శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన వాసం సత్యనారాయణ, సత్తుపల్లి మండలం, బేతుపల్లి గంగారాం గ్రామానికి చెందిన తిరుపతి నాగరాజు, సూరవరపు హరిప్రసాద్ అనువారలు శుక్రవారం రాత్రి ఆటోపై ఎ కొండూరు తండాకు వచ్చి సూర్యం అతని కుమారుడు భూక్యా గోపిచంద్ ఇంట్లో క్షుద్రపూజలు, చేతబడి, బాణామతి పేరుతో పూజలు చేస్తు గిరిజన తండా వాసులను భయభ్రాంతులకు గురిగచేస్తుండగా విషయాన్ని తండా వాసులు కొందరు విఆర్‌ఓ డేవిడ్‌రాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్ధానిక పోలీసులకు తెలియపర్చగా ఎస్‌ఐ పివి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తులను ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి శనివారం తిరువూరు కోర్టుకు హాజరు పర్చినట్లు ఎస్‌ఐ చెప్పారు.