క్రైమ్/లీగల్

మాజీ మంత్రికి ఫోన్‌లో బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూన్ 15: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని ఫోన్‌లో బెదిరించారనే ఆరోపణపై గుంటూరు జిల్లాకు చెందిన ఒక యువకుడిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట మండలంలోని తాళ్లచెరువు గ్రామంలో ఉన్న ఏరువ బాలకిరణ్‌రెడ్డి అనే వ్యక్తిని కడప జిల్లా పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. బాల కిరణ్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని ఫోన్‌లో బెదిరించటంతో పాటు డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి అటెండర్ డేగల కిరణ్ ఫిర్యాదుతో కడప జిల్లా పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తండ్రి ఏరువ తోమాస్‌రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ తెల్లవారుజామున కడప జిల్లా పోలీసులు వచ్చి తమ కుమారుడిని అదుపులోకి తీసుకుని వెళ్లారని, మాజీ మంత్రిని ఫోన్‌లో బెదిరించాడని తమకు తెలియజేశారన్నారు. తన కుమారుడిని ఎక్కడికి తీసుకెళ్లారో ఆచూకీ ఇంతవరకు లభించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. తన కుమారుడి ఆచూకీ తెలిపి, తమకు అప్పగించాలని కోరారు.