క్రైమ్/లీగల్

అక్రమ నిర్బంధంపై ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: కాగజ్‌నగర్ , కొమరంబీమ్ జిల్లా రేపల్లెలో ఉన్న ఆదివాసులను అక్రమంగా నిర్బంధించడంపై తెలంగాణ హైకోర్టులో శనివారం నాడు పిటీషన్ దాఖలైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బెంచ్ ముందు హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటీషన్‌ను పౌరహక్కుల సంఘం దాఖలు చేసింది.
గత నాలుగు రోజులుగా 67 మంది ఆదివాసులను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి రేపు సాయంత్రం ఐదు గంటలకు అందర్నీ కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు. బలవంతంగా ఎవరినీ బంధించలేదని, వాళ్ల ఇష్టపూర్వకంగానే వచ్చి ఫారెస్టు డిపోలో ఉంటున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. ఆదివాసులు అందర్నీ కోర్టు ముందుంచితే అసలు వాస్తవాలు తెలుస్తాయని పిటీషనర్ పేర్కొన్నారు. ఆదివాసీలను ప్రభుత్వ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌కు తీసుకురావాలని హైకోర్టు పేర్కొంది.