క్రైమ్/లీగల్

నకిలీ ఎస్సై గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, జూన్ 15: విజయవాడ కేంద్రంగా మాఫియా నడపడానికి సన్నాహాలు చేసుకున్న నకిలీ ఎస్సై గుట్టుని పోలీసులు రట్టు చేశారు. గత మూడు రోజులుగా సాగుతున్న వ్యవహారానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు శనివారం తెరదించారు. చీపురుపల్లి మండలం గొల్లలపాలేనికి చెందిన బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్ ఆరు నెలల కిందట గ్రామాన్ని వదిలి విజయవాడకు చేరాడు. అక్కడే ఒక హోటల్‌లో పనిచేస్తూ ఒక్కసారిగా ఎస్సై అవతారం ఎత్తేసరికి అందరికీ అనుమానాలు వచ్చాయి. ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా నకిలీ పిస్తోలుతో ఎస్సై, కానిస్టేబుళ్లతో హడావుడి చేయడంతో గ్రామస్తుల్లో అనుమానం ఉన్నా పట్టించుకోలేదు. అయితే ప్రసాద్‌పై గతంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పోలీస్ స్టేషన్‌లో కేసు ఉన్నట్టు చీపురుపల్లి పోలీసులు గుర్తించారు. ఇంకేముంది నకిలీ ఎస్సై గుట్టు రట్టయింది. విజయవాడలో ఉండే సమయంలో ఫేస్‌బుక్‌లో ఎస్సై డ్రెస్‌తో ఫొటోలు పెడుతుండడంతో స్నేహితులు పరిచయం అవ్వడం, వారితో స్నేహం పెంచుకోవడం, కలవడం చివరకు హోంగార్డు ఉద్యోగం ఇప్పించే వరకు తీసుకొచ్చేవాడు. ఇలాగే భీమవరం మండలం గుట్లపాడు గ్రామానికి చెందిన కొయ్యలగడ్డ స్వామి నకిలీ ఎస్సై ప్రసాద్ అలియాస్ ప్రశాంత్‌తో కలిసి డీఎన్‌ఆర్ కళాశాలలో డిగ్రీ కలిసి చదివిన పరిచయంతో తన స్నేహితులు టి భానుప్రకాష్, సంఘాని గణ్‌ష్‌లకు పరిచయం చేసి హోంగార్డులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు వారి వద్ద నుంచి రూ.24 ప్రసాద్ తీసుకున్నట్లు స్వామి విలేఖరులకు తెలిపాడు. వీరికి శ్రీకాకుళం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్‌లో ఒకరిని, మరో రెండుచోట్ల హోంగార్డులుగా డీజీపీ ద్వారా పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చినట్టు సృష్టించి నకిలీ ఉత్తర్వులు ఇవ్వడంతో పోల్చిన స్వామి, అతని స్నేహితులు భీమవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఎస్సై వివరాలు బయటకు వచ్చాయి. అప్పుడే ప్రసాద్ చీపురుపల్లి మండలం గొల్లలపాలం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి చీపురుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నకిలీ ఎస్సై ప్రసాద్ విజయనగరం నుంచి గొల్లలపాలెం వచ్చేందుకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన నెల్లిమర్లకు చెందిన వ్యక్తికి చెందిన సుమో వాహనాన్ని అద్దెకు తీసుకుని దానికి పోలీస్ స్టిక్కర్ చేయించి గొల్లలపాలెం రావడంతో చీపురుపల్లి పోలీసులు పట్టుకున్నారు.
దీంతో ఆరు నెలలుగా ఎస్సైగా చెలామణి అవుతూ వచ్చిన నకిలీ ఎస్సై కథకు ముగింపు పలికారు పోలీసులు. అయితే డ్రైవర్‌గా మంగళరిగికి చెందిన వేముల అంకాలబాబు కూడా నకిలీ కానిస్టేబుల్‌గా ప్రసాద్‌కి సహరించడంతో అతడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేవలం తాను పోలీస్ డ్రెస్ వేసుకున్నానే తప్పా ఇంకేం నేరం చేయలేదని అంకాలబాబు పేర్కొన్నాడు. కాగా ఈ మధ్య కాలంలోనే రియల్టర్ సెటిల్‌మెంట్ చేయడంతో పాటు ఫేస్‌బుక్ ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలానికి చెందిన మహిళలను వీరి గ్రూప్‌లోకి లాగినట్టు పోలీసులు సమాచారం అందింది. లోతుగా విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం లేకపోలేదు.

చిత్రం...నకిలీ ఎస్సై బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్