క్రైమ్/లీగల్

రైల్వే టికెట్ ఏజెంట్లపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దొడ్డిదారిన టికెట్లను ఇస్తున్న దళారులు, ఏజెంట్లపై రైల్వే అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.‘ఆపరేషన్ థండర్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే రక్షణ దళాలకు చెందిన సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నకిలీ ఏజెంట్లు, దళారులను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఈ- టౌటింగ్ ఆన్‌లైన్ ద్వారా అనధికార రైల్వే టికెట్లను అమ్మే దళారులపై ఆర్‌పీఎఫ్ ముప్పేట దాడులు చేపట్టారు. దక్షిణ మధ్య జోన్ పరిధిలో దాదాపు 20 స్టేషన్లలో ఆపరేషన్ థండర్ దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ థండర్ దాడుల్లో దళారుల నుంచి రూ.11,66,355 లక్షల విలువైన అడ్వాన్స్ టికెట్లతో పాటు 774 ప్రయాణం పూర్తియిన టికెట్లు దాదాపు 896 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల దాడుల్లో 20 మంది దళారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో వ్యక్తిగత యూజర్ ఐడీలను ఉపయోగించి టికెట్లను బుకింగ్ చేసినట్లు తనిఖీల్లో బయటపడింది. దళారులు తత్కాల్ ఈ టికెట్లను వేగంగా బుక్ చేసుకోవడానికి నిషేధించిన ఎఎన్‌ఎంఎస్/ రెడ్‌మిర్చి అనే సాప్ట్‌వేర్‌లను ఉపయోగించనట్లు ఆర్‌పీఎఫ్ తనిఖీల్లో వెలుగు చూచింది. ఆపరేషన్ థండర్ దాడుల్లో ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌తో పాటు ఇన్‌స్పెక్టర్ జనరల్ జీఎం ఈశ్వర్‌రావు వివిధ రైల్వే డివిజన్‌లకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ థండర్‌లో సమయస్ఫూర్తితో పని చేసిన అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ అభినంధించారు. ఆపరేషన్ థండర్ దాడుల్లో రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, విజయవాడ, భీమవరం, నెల్లూరు. గుంటూరు, నరసరావుపేట, నాందేడ్, ఔరంగాబాద్ తదితర రైల్వే స్టేషన్లలు ఉన్నాయి.
రైల్వే ఎంప్లారుూస్ సంఘ్ కార్యాలయాన్ని ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వేలో గుర్తింపు పొందిన రైల్వే ఎంప్లారుూస్ సంఘ్ కార్యలయాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం యూనియన్ ఉద్యోగుల నుద్దేశించి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల బృందమే రైల్వే సంస్థకు మూల స్థంభమని అన్నారు. భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే జోన్ గొప్ప గుర్తింపు పొందడానికి ఉద్యోగుల అంకిత భావమే కారణమన్నారు. ఉద్యోగులు రైల్వే సంస్థకు మధ్య వంతెనలా కార్మిక సంఘాలు పని చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎంప్లారుూస్ సంఘ్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డి, ద,మ, అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్, ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీరు అర్జున్ ముండియా, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ ఇంజనీర్ విఎం శ్రీవాస్తవ, కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్ పాల్గొన్నారు.